- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిసోడియాకు మరోసారి చుక్కెదురు: బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ‘సిసోడియా ప్రభావవంతమైన వ్యక్తి. చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారు. కాబట్టి సిసోడియా బయటకు వస్తే వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. ఎలక్ట్రానిక్ ఆధారాలతో సహా కీలకమైన సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించే చాన్స్ ఉందని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒకసారి కలవడానికి కోర్టు అనుమతిచ్చింది. అంతకుముందు రౌస్ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని మే 31 వరకు పొడిగించింది. దీంతో సిసోడియాకు భారీ షాక్ తగిలినట్టు అయింది. కాగా, గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మార్చి 9న ఈడీ అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తిహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని అంగీకరించడం లేదని, దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.