ఇంధన ఒప్పందాన్ని భారతీయ కంపెనీకి ఇచ్చిన శ్రీలంక

by S Gopi |
ఇంధన ఒప్పందాన్ని భారతీయ కంపెనీకి ఇచ్చిన శ్రీలంక
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాకు చెందిన సంస్థ గెలుచుకున్న టెండర్‌ను రద్దు చేసిన తర్వాత శ్రీలంక ప్రభుత్వం మూడు సోలార్, విండ్ హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి ఫెసిలిటీల నిర్మాణాన్ని శుక్రవారం భారత కంపెనీకి అప్పగించింది. గత కొంతకాలంగా కీలక గ్లోబల్ రవాణా లేన్‌లకు సమీపంలో శ్రీలంకలో పెరుగుతున్న చైనా ప్రభావంపై భారత ప్రభుత్వం ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. మొదట ఈ ప్రాజెక్ట్ కోసం ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) రుణాల రూపంలో నిధులను సమకూర్చింది. అయితే, రెండేళ్ల క్రితం ఈ విషయంలో చైనా ప్రమేయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ ప్రాజెక్టును పునరుద్ధరించామని, ఇప్పుడు 11 మిలియన్ డాలర్ల భారత ప్రభుత్వ గ్రాంట్‌తో నిధులు సమకూరుతాయని ప్రకటించింది. భారత్‌లోని బెంగళూరుకు చెందిన పునరుత్పాదక సంస్థ యూ-సోలార్‌కు భవన నిర్మాణ కాంట్రాక్టు లభించిందని తెలిపింది. ఈ మూడు ఫెసిలిటీలు కలిపి 2,230 కిలోవాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed