గత ఐదేళ్లలో ప్రకటనలకు రూ.3,723 కోట్ల ఖర్చు: Centre

by S Gopi |   ( Updated:2022-12-15 14:11:28.0  )
గత ఐదేళ్లలో ప్రకటనలకు రూ.3,723 కోట్ల ఖర్చు:  Centre
X

న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో కేంద్రం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా రూ.3,723.38 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలియజేసింది. గురువారం రాజ్యసభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో ప్రకటనలపై ఖర్చులు పెరగలేదని చెప్పారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం 2017-18లో రూ.1,220.89 కోట్లు, 2018-19లో రూ.1,106.88 కోట్లు, 2019-20లో రూ.627.67 కోట్లు, 2020-21లో రూ.349.09 కోట్లు, ఈ ఏడాది ఇప్పటివరకు రూ.264.78 కోట్లు ప్రకటనలపై వెచ్చించినట్లు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ప్రకటనలపై ఖర్చు క్రమేపి తగ్గినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed