- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నమ్మక ద్రోహంతో కొత్త రికార్డు సృష్టించారు.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా బిహార్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నమ్మక ద్రోహంతో నితీష్ కుమార్ కొత్త రికార్డు సృష్టించారని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి నమ్మకం కోల్పోవడం కంటే పెద్ద ఓటమి మరొకటి ఉండదని అన్నారు. దీనికి ప్రజలే సరైన విధంగా బుద్ధి చెబుతారని తెలిపారు. బీజేపీ తన జీవితకాలంలో ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్‌పైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో తమ పొత్తు కాంగ్రెస్‌తోనే కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే, 2022లో బీజేపీతో సంబంధాలను తెగదెంపులు చేసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ సారధ్యంలోని ఆర్జేడీతో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి లాలూ ప్రసాద్‌తో తెరదెంపులు చేసుకొని మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని స్థాపించారు.