- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sourav Ganguly : కోల్‌కతా నిరసనల్లో సౌరవ్ గంగూలీ
దిశ, నేషనల్ బ్యూరో : ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి బలైన జూనియర్ వైద్యురాలికి న్యాయం జరగాలని కోరుతూ కోల్‌కతాలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పాల్గొన్నారు. ఆయన సతీమణి, ప్రముఖ ఒడిస్సీ డ్యాన్సర్ డోనా గంగూలీ, కుమార్తె సనా గంగూలీ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి సత్వరం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా తన కుమార్తె సనా గంగూలీతో కలిసి సౌరవ్ గంగూలీ కొవ్వొత్తులను వెలిగించి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.
మనకు సురక్షితమైన సమాజం కావాలని డోనా గంగూలీ అన్నారు. ‘‘మహిళలపై రేప్ ఘటనల గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. 2024 సంవత్సరంలో కూడా ఈ అరాచకం కొనసాగుతుండటం బాధాకరం. వెంటనే ఇలాంటి దురాగతాలను ఆపాలి. దోషులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి’’ అని సనా గంగూలీ పేర్కొన్నారు.