BMW: లగ్జరీ కారు దిగి బహిరంగంగా ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన వ్యక్తి

by Shamantha N |
BMW: లగ్జరీ కారు దిగి బహిరంగంగా ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన వ్యక్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒక వ్యక్తి బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూణేలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్ గా మారింది. రోడ్డు మధ్యలో బీఎండబ్ల్యూ డోర్‌ తెరిచి బయటకు వచ్చి... గౌరవ్ అహుజా అనే వ్యక్తి ట్రాఫిక్ స్టాప్ వద్ద యూరిన్ చేశాడు. దీంతో, సతారా జిల్లాకు చెందిన గౌరవ్ అహుజాను పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అరెస్టు ముందు అహుజా ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో.. “నేను చేసిన చర్యకు సిగ్గుపడుతున్నాను. పూణే, మహారాష్ట్ర సహా దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా. పోలీస్ శాఖకు, షిండే సాహెబ్ ను క్షమించమని కోరుతున్నా. దయచేసి, నన్ను ఈ ఒక్కసారి నన్ను మన్నించండి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మరోసారి ఇలాంటి తప్పు చేయను” అని చెప్పుకొచ్చాడు.

గతంలోనూ కేసులు

ఇకపోతే, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత పూణే నుంచి కొల్హాపూర్ కి అహుజా పారిపోయాడు. ఆ తర్వాత వీడియో రిలీజ్ చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అధికారులు చివరికి అహుజాను సతారా జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత చట్టపరమైన చర్యల కోసం ఎరవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా, ఆ సమయంలో లగ్జరీ కారులో అహుజాతో పాటుతో ఉన్న భాగ్యేష్ ఓస్వాల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతను, అహుజా ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓస్వాల్‌ను వైద్య పరీక్షల కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. "యెరవాడలోని శాస్త్రినగర్ చౌక్ వద్ద ఒక యువకుడు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నట్లు ఉన్న వీడియో చూశాం. ఆ తర్వాత విచారణ ప్రారంభించాం" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిమ్మత్ జాధావో అన్నారు. ఇకపోతే, నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని మోటారు వాహనాల చట్టం కింద ప్రజలకు ఇబ్బంది కలిగించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ప్రజా భద్రతకు హాని కలిగించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో గౌరవ్ అహుజా, అతని తండ్రి మనోజ్ అహుజా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సంబంధిత వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తేలింది. అహుజా 20 ఏళ్లు ఉన్నప్పుడు అతడిపై గ్యాంబ్లింగ్, దోపిడీ కేసు నమోదైంది. అతడ్ని క్రికెట్ బెట్టింగ్ ముఠాలో భాగంగా తేల్చింది.

Next Story