- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sooraj revanna: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్..పలు షరతులతో మంజూరు
దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో జనతాదళ్ సెక్యులర్( జేడీఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు బెయిల్ లభించింది. సూరజ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని స్పెషల్ కోర్టు సోమవారం విచారించింది. అనంతరం న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ రూ.2లక్షల పూచీ కత్తుతో పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఫిర్యాదు దారులను, బాధితులను బెదిరించకూడదని, దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదని తెలిపారు. పిలిచినప్పుడల్లా విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని సూచించారు.
అలాగే తన పాస్ పోర్టును కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. కోర్టు నుంచి వ్రాతపూర్వక అనుమతి పొందకుండా రాష్ట్రం విడిచి వెళ్లరాదని పేర్కొన్నారు. కాగా, సూరజ్ రేవణ్ణపై 27 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూరజ్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో హోలెనరసిపురా రూరల్ పోలీస్ స్టేషన్‌లో సూరజ్ పై ఐపీసీ 377, 2, 506, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయనను జూన్ 23న అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపర్చగా కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.