ఒక‌టే కాలితో గెంతుతూ బ‌డికెళ్లే పాప‌.. ఆమెకు సోనూసూద్ ఈ ప్రామిస్‌..?! (వీడియో)

by Sumithra |
ఒక‌టే కాలితో గెంతుతూ బ‌డికెళ్లే పాప‌.. ఆమెకు సోనూసూద్ ఈ ప్రామిస్‌..?! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌నిషి ద‌గ్గ‌ర నుండి దోపిడీ చేయ‌లేనిది విద్య ఒక్క‌టే.. అందుకే, అణ‌గారిన వ‌ర్గాల్లో చాలా మంది ప్ర‌జ‌లు స‌రైన వ‌న‌రులు లేక‌పోయినా, చ‌దువు కోసం ఆరాట‌ప‌డ‌తారు. బీహార్‌లోని జముయ్‌కి చెందిన ఒక విభిన్న ప్ర‌తిభావంతురాలు కూడా త‌న‌కున్న ఒంటికాలిపై ప్రతిరోజూ పాఠశాలకు వెళుతోంది. 10 ఏళ్ల వ‌య‌సున్న సీమా తన ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామ పాఠశాలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో సీమా తన స్కూల్ యూనిఫాం, బ్యాక్‌ప్యాక్‌లో చెప్పులు లేకుండా ఒకే కాలుమీద గెంతుతూ వెళ్ల‌డం చూడొచ్చు. త‌న క‌ష్టాన్ని చూపించే ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో అంద‌ర్నీ హృద‌యాల‌ను ద్ర‌వింప‌జేస్తోంది.

ఈ నేప‌థ్యంలో సీమా కథ చాలా మంది నెటిజన్లను ప్రేరేపించగా, రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఈ అమ్మాయిని ప్ర‌శంసించారు. ఇక‌, సంక్షోభంలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు దూకే సుప‌రిచిత నటుడు సోనూసూద్ ఈ వీడియోను చూసి సీమకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వీడియోకు స్పందిస్తూ సోనూసూద్‌ హిందీలో చేసిన ట్వీట్‌లో, సీమా తన రెండు కాళ్లతో త్వరలో పాఠశాలకు వెళుతుందని హామీ ఇచ్చారు. ఆమెకు కృత్రిమ కాలు ఇప్పించేందుకు సాయం చేస్తానని, దాని టికెట్ పంపుతున్నట్లు తెలిపారు.

పెద్దయ్యాక టీచర్‌ కావాలనుకునే సీమ రెండేళ్ల క్రితం యాక్సిడెంట్‌లో కాలు పోగొట్టుకుంది. దీంతో కాలు తీసేయాల్సి వచ్చింది. ఆమె వైకల్యంతో ఉన్నప్పటికీ చదువుకోవడం, స్కూలుకు వెళ్లడం ఆమెకు ఇష్టం. దీనితో ఆమె తల్లిదండ్రులు గ‌ర్వ‌ప‌డేలా చేయాల‌నుకుంటుంది. ఈ క్ర‌మంలో ఆమెకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా పుస్తకాలు బ‌హుమ‌తిగా ఇస్తూ ఆమె ఆశ‌యానికి స‌హ‌క‌రిస్తూ ఉంటారు. ఈ త‌రుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ కూడా సీమా వైరల్ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది తనను భావోద్వేగానికి గురి చేసిందన్న ఆయ‌న‌, ప్రతి బిడ్డకు మంచి విద్య అవసరమని, ప్రతి బిడ్డకు మంచి విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు పని చేయాలని అన్నారు.

Advertisement

Next Story