- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్‌ను ప్రధాని చేయడమే సోనియా లక్ష్యం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, ఆర్జేడీలు కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేస్తాయని ఆరోపించారు.పేదల కోసం మాత్రం ఎన్నడూ పనిచేయలేదని తెలిపారు. శనివారం ఆయన బిహార్ రాజధాని పాట్నాలో బీజేపీ అనుబంధ ఓబీసీ మోర్చా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. పేదలకు మేలు చేసేది కేవలం బీజేపీ, ప్రధాని మోడీ మాత్రమేనని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలు తమ కుటుంబాల కోసమే పాటు పడ్డారని, వెనుక బడిన ప్రజల పేరుతో లాలూ కుటుంబం రాజకీయాలు చేస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడం సోనియా గాంధీ లక్ష్యం కాగా, తన కొడుకును ముఖ్యమంత్రిగా చూడటం లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యమని విమర్శించారు. త్వరలోనే కమిటీలే వేసి రాష్ట్రంలో పేదల భూములు లాక్కున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బిహార్‌లో మళ్లీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిందని, ల్యాండ్ మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీలు ఎక్కువ కాలం అధికారంలో ఉన్నప్పటికీ, సీనియర్ నేత కర్పూరీ ఠాకూర్‌కు తగిన గౌరవం ఇవ్వలేదన్నారు. కానీ మోడీ ప్రభుత్వం ఠాకూర్‌కు భారతరత్న ఇచ్చింది గౌరవించిందన్నారు.