- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Social Media: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి
దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్‌స్టా రీల్స్ పిచ్చిలో పడి 16 ఏళ్ల బాలిక ప్రాణాల మీదికి తెచ్చుకుంది. రీల్స్ చేస్తూ ఆరవ అంతస్థు నుంచి పడిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం కొందరు ఎంతటి దారుణాలకైన ఒడిగడుతుండగా.. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి రీల్స్ లో నటిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. ఇందిరాపురం సోసైటీలోని అపార్ట్‌మెంట్‌లో ఆరవ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న మోనిషా రీల్స్ లో నటించేందుకు తమ ఫ్లాట్ బాల్కనీలోకి వచ్చింది. అక్కడ నిలబడి తన మొబైల్ లో వీడియో తీసుకుంటుండగా.. ఆమె చేతిలోని మొబైల్ జారీ పడింది. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ.. ఆమె కూడా జారీ పడిపోయింది. 6వ అంతస్థు నుంచి పడిపోవడంతో మోనీషా తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె పడిపోయాక ఆసుపత్రికి తరలిస్తున్న దృష్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం మోనీషా పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.