- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 86 లక్షల విలువైన బంగారు కడ్డీల పట్టివేత..
న్యూఢిల్లీ: రూ.86 లక్షల విలువైన 12 బంగారు బిస్కెట్లను పురీషనాళంలో దాచుకున్న స్మగ్లర్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఆదివారం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో పట్టుకుంది. ఇతను బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్‌లోని హకీంపూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ వద్ద జవాన్లు అతడిని పట్టుకున్నారు. 1.397 కిలోల బరువున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.86,04,659 ఉంటుంది. పట్టుబడిన స్మగ్లర్‌ను బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని హకీంపూర్ గ్రామానికి చెందిన 56 ఏళ్ల మైనూర్ ఖాన్‌గా గుర్తించారు.
బంగ్లాదేశ్ సత్‌ఖిరా జిల్లాకు చెందిన సహజుల్ మే 26వ తేదీన తన ఇంటికి వచ్చి 6 ప్యాకెట్లలో 12 బంగారు బిస్కెట్లను ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది. బసిర్‌హత్‌లోని ఓ వ్యక్తికి ఈ బంగారు బిస్కెట్లను అందజేసే పనిని మైనూర్‌కు అప్పజెప్పారు. ఇందుకు రూ. 1300 ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ, హకీంపూర్ చెక్ పోస్ట్ వద్ద అతను పట్టుపడ్డాడు. తక్కువ మొత్తంలో డబ్బుకోసం సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో నివసించే గ్రామస్తులు తరచూ ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు.