- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ సుప్రీంకోర్టుకు వచ్చే ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
అయితే సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సింఘ్వీ ఈ సందర్భంగా ఉదహరించారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం 3:50 గంటలకు విచారణ జరుపుతామని తెలిపారు. కాగా మనీష్ సిసోడియాను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు చెప్పడంతో సీబీఐ విచారణ మరింత ముమ్మరం చేసింది. తమ కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియా ను విచారిస్తోంది. విచారణను వీడియో రికార్డ్ చేస్తున్నది.