- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MUDA Scam: హైకోర్టుని ఆశ్రయించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
దిశ, నేషనల్ బ్యూరో : మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణంపై సిద్ధరామయ్య హైకోర్టుని ఆశ్రయించారు. సిద్ధరామయ్యను ఈ కేసులో విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇటీవల ఆమోదం తెలిపారు. భూ కుంభకోణం కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ శనివారం లోకాయుక్తకు అనుమతి ఇచ్చారు. దీంతో, కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కాం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తనపై గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తారు. ఈ మేరకు గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. ఇదిలావుంటే గతంలో గవర్నర్‌ల అనుమతితో విచారణ ఎదుర్కొన్న పలువురు ముఖ్యమంత్రులు అరెస్టయ్యారు. సామాజిక కార్యకర్తలు టీజే అబ్రహం, మైసూర్‌కు చెందిన స్నేహమయి కృష్ణ, బెంగళూరుకు చెందిన ప్రదీప్ కుమార్ ఈ అంశంపై ప్రాసిక్యూషన్ అనుమతిని కోరారు. జూలైలో అబ్రహం అనుమతి కోరగా కొద్దిసేపటికే గవర్నర్ ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ముడా కుంభకోణం ఏంటంటే?
సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన కేసరు గ్రామంలోని 3.16 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. ఈ భూమిని లేఅవుట్ అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పార్వతికి 2022లో విజయనగరంలో 14 ప్రీమియం భూమును పరిహారం కింద కేటాయించారు. ముడా స్వాధీనం చేసుకున్న స్థలంతో పోలిస్తే ఆమెకు కేటాయించిన భూములు ఎక్కువగా ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ కేసుని విచారించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ దేశాయ్ నేతృత్వంలో ఏక సభ్య విచారణ కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.