Sidda ramaiah: గవర్నర్ వివక్ష చూపుతున్నారు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by vinod kumar |   ( Updated:2024-08-21 15:49:29.0  )
Sidda ramaiah: గవర్నర్ వివక్ష చూపుతున్నారు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తనపై వివక్ష చూపుతున్నారని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ముడా కుంభకోణం కేసులో తనను ప్రాసిక్యూట్ చేసేందుకు వెంటనే పర్మిషన్ ఇచ్చిన గవర్నర్, కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి విషయంలో మాత్రం ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కొప్పల్‌లో సిద్ధరామయ్య బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎటువంటి నివేదిక లేకున్నా నాపై విచారణకు అనుమతిచ్చిన గవర్నర్ కుమారస్వామి విషయంలో మాత్రం ఎందుకు కాలయాపన చేస్తున్నారన్నారు. ఇది వివక్ష కాక ఇంకేమిటని ప్రశ్నించారు.

అక్రమ మైనింగ్ కేసులో కుమారస్వామిపై విచారణకు లోకాయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనుమతిని కోరిందని, కానీ గవర్నర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కుమారస్వామి ఇప్పటికే భయాందోళనలో ఉన్నారని, గవర్నర్ ఇన్వెస్టిగేషన్‌కు అనుమతిస్తారేమోననే ఆందోళనతో ఉన్నాడన్నారు. అంతకుముందు కుమారస్వామి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తప్పుడు కేసుతో తనపై దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు.

Advertisement

Next Story