నోరు అదుపులో ఉంచుకో.. ఆ ఎంపీకి స్ర్టాంగ్ వార్నింగ్

by S Gopi |   ( Updated:2023-02-08 10:23:31.0  )
నోరు అదుపులో ఉంచుకో.. ఆ ఎంపీకి స్ర్టాంగ్ వార్నింగ్
X

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ హేమమాలిని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్రాకు వార్నింగ్ ఇచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్షాలు తమ నాలుకను అదుపులో ఉంచుకోవాలని, మహువా మొయిత్రా 'ప్రమాదకరమైన' పదాన్ని ఉపయోగించారని అని అన్నారు. టీడీపీ ఎంపీ కే రాంమోహన్ నాయుడు రాష్ట్రపతి ధన్యావాదాలు తెలుపుతుండగా మహువా అభ్యంతరకర పదాన్ని ఉపయోగించినట్లు చెప్పారు. అతిగా స్పందిచడం, భావోద్వేగానికి గురి కాకుండా, ప్రతి ఒక్క సభ్యుడు మర్యాదపూర్వకంగా ఉండాలి అని అన్నారు. అయితే మహువా మొయిత్రా క్షమాపణ చెప్పాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమె క్షమాపణలు చెప్పకపోతే, అది వారి సంస్కృతని అన్నారు. అయితే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని టీఎంసీ ఎంపీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story