మందుబాబులకు షాకింగ్ న్యూస్.. సర్కార్ సంచలన నిర్ణయం!

by GSrikanth |
మందుబాబులకు షాకింగ్ న్యూస్.. సర్కార్ సంచలన నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానా కేబినెట్ ఇటీవల ఆమోదించిన కొత్త ఎక్సైజ్ పాలసీ ఆసక్తికరంగా మారింది. హర్యానా కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం విక్రయించే ప్రతి మద్యం బాటిల్‌పై ఆవు సెస్ విధించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆవుల సంక్షేమం కోసం నిధుల సేకరణపై దృష్టిసారించిన ప్రభుత్వం.. ఇందులో భాగంగా ఆవు సెస్‌ను ప్రవేశపెట్టింది. గత మంగళవారం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపింది. మద్యం బాటిల్‌పై రూ.5 ఆవు సెస్‌ను ప్రవేశపెట్టింది. ఇలా సేకరించిన ఆదాయం గోసేవ, గోవుల సంక్షేమం, మౌళిక సదుపాయల కల్పన కోసం వినియోగించనున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఆవు సెస్‌ ద్వారా రూ.400 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్యానా గో సేవా ఆయోగ్ ఉపాధ్యక్షుడు పురాణ్ యాదవ్ మాట్లాడుతూ.. పంచాయతీ భూముల్లో గోశాలల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తామన్నారు. ఏడాది పొడవునా నిర్వహించే రెస్క్యూ ఆపరేషన్‌లలో కోలుకున్న పశువులకు వసతి కల్పించేలా సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆరు నెలల్లో రోడ్లపై సంచరించే పశువులు లేకుండా పని చేస్తున్నామన్నారు. ఇటీవల తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed