- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shocking: చేతిలో పేలిన కొత్త హెయిర్ డ్రైయర్.. రెండు చేతులు కోల్పోయిన మహిళ
దిశ, వెబ్ డెస్క్: కొరియర్ లో పార్సిల్(Parcel) వచ్చిన హెయిర్ డ్రైయర్(Hair Dryer) పేలి ఓ మహిళ రెండు చేతులు(Hands) కోల్పోయిన ఘటన కర్నాటక(Karnataka)లో జరిగింది. బాగల్ కోట్(Bagal kot) లో జరిగిన ఘటన ప్రకారం శశికళ అనే మహిళకు కొరియర్ నుంచి ఓ పార్సిల్ వచ్చింది. అదే సమయానికి ఆమె ఊర్లో లేనందున పార్సిల్ తీసుకోవాలని ఎదురింట్లో ఉండే బసవమ్మ అనే మహిళకు చెప్పింది. అనంతరం ఆ పార్సిల్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న హెయిర్ డ్రైయర్ ఆన్ చేసి చెక్ చేయాలని కోరింది.
దీంతో బసవమ్మ(Basavamma) ఆ హెయిర్ డ్రైయర్ ను చెక్ చేసేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా పేళి, పెద్ద శబ్ధం వచ్చింది. పేళుడు దాటికి ఆమె రెండు చేతులకు ఉన్న అన్ని వేళ్లు తెగిపడ్డాయి. రక్తపు మరకలలో ఉన్న బసవమ్మను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళ దివంగత సైనికుడు పాపన్న భార్య బసవ రాజేశ్వరి(Basva Rajeshwari) అని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పార్సిల్ విశాఖపట్టణానికి(Vizag) చెందిన హెయిర్ డ్రైయర్ తయారీదారు నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.