- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసోంలో కాంగ్రెస్‌కు షాక్: పార్టీని వీడిన సీనియర్ ఎమ్మెల్యే
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సీనియర్ లీడర్లు పార్టీకి రిజైన్ చేశారు. తాజాగా అసోంలో సీనియర్ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు సోమవారం లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. లఖింపూర్ జిల్లా నౌబోయిచా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భరత్ తన భార్యకు లోక్ సభ టికెట్ కేటాయించనందు వల్లే పార్టీని వీడినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. లఖింపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తన భార్య రాణి నారాను బరిలోకి దింపాలని ఆశించాడు. కానీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఉదయ్ శంకర్ హజారికాను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భరత్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. రాణీ నారా లఖింపూర్ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. రాణి నారా, ఉదయ్ శంకర్ హజారికాలు ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి లఖింపూర్ నియోజకవర్గ సీటుపై వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా..హజారికాకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, అసోంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో, కాంగ్రెస్ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. దాని మిత్రపక్షమైన అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) ఒక స్థానం నుంచి పోటీ చేయనుంది.