- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్‌లో బీజేపీకి షాక్: పోటీ నుంచి తప్పుకున్న ఎంపీ అభ్యర్థులు
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి షాక్ తగిలింది. ఇటీవల పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా..ఇద్దరు అభ్యర్థులు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని వడోదర సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజన్ బట్‌ను బరిలోకి దింపగా.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ విషయాన్ని రంజన్ భట్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీలోని పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. వడోదర లోక్‌సభ నుంచి ఆమెను మళ్లీ నామినేట్ చేయాలనే బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నగరంలోని వివిధ ప్రదేశాలలో బ్యానర్లు ప్రదర్శించారు. ఈ కారణంతోనే ఆమె పోటీ నుంచి వైదొలగుతున్నట్టు తెలుస్తోంది. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని మోడీ ఆ స్థానం నుంచి మోడీ తప్పుకోవడంతో భట్ గెలుపొందారు. అనంతరం 2019లోనూ విజయం సాధించారు.
అలాగే సబర్‌కాంత లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి భిఖాజీ ఠాకూర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సోషల్ మీడియాలో ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఠాకూర్ పై కూడా స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ పరిణామాలను నియంత్రించాలని బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. కానీ ఈ నేపథ్యంలోనే పోటీ నుంచి తప్పకుంటున్నట్టు ఇద్దరు నేతలు ప్రకటించారు. కాగా, గుజరాత్ లోని 26 లోక్‌సభ స్థానాలకు మే 7న ఎన్నికలు జరగనున్నాయి.