- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Shivasena Ubt: అబ్బాయిలకు ఉచిత విద్య, ధారావి ప్రాజెక్టు రద్దు.. శివసేన(యూబీటీ) మేనిఫెస్టో రిలీజ్
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)కు గాను శివసేన(UBT) తన మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే (Uddav thakrey) దీనిని రిలీజ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే విద్యార్థినులకు ఉచిత విద్య అందుతున్నట్టే బాలురకు సైతం ఉచిత విద్య అందిస్తామని శివసేన (యూబీటీ) హామీ ఇచ్చింది. అలాగే నిత్యావసర ధరలను నియంత్రిస్తామని, థారావీ రీడెవలప్ మెంట్ ప్రాజెక్టు (Dharavi redevelopment project)ను రద్దు చేస్తామని మేనిఫోస్టోలో పేర్కొంది. పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర (Maharashtra), ముంబై(Mumbai)లలో హౌసింగ్ పాలసీ తీసుకొస్తామని వెల్లడించింది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో అందుబాటు ధరలో ఇళ్లు నిర్మిస్తామని తెలిపింది.
ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానాలు చాలా వరకు ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ (MVA) మ్యానిఫెస్టోలో భాగమని చెప్పారు. అయితే కొన్ని అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎంవీఏ కూటమి అధికారంలోకి వస్తే కోలివాడ, గౌతంల క్లస్టర్ అభివృద్ధిని నిలిపివేస్తామని, నిర్వాసితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధి కల్పనకు సైతం కృషి చేస్తామని ప్రతి మూడు నెలలకోసారి ప్రతి జిల్లాలో జాబ్ మేళా(Job mela)లు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.