Sharad Pawar: ఎలాంటి వారి చేతిలో దేశం ఉందో ఆలోచించుకోవాలి

by Shamantha N |
Sharad Pawar: ఎలాంటి వారి చేతిలో దేశం ఉందో ఆలోచించుకోవాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) చీఫ్ శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. అత్యంత అవినీతి పరుడు శరద్ పవార్ అని అమిత్ షా చేసిన కామెంట్లపై ఆయన నిప్పులు చెరిగారు. గతంలో ఓ కేసుకు సంబంధించిన అమిత్ షాను సుప్రీం కోర్టు రెండేళ్లు బహిష్కరించిందని చురకలు అంటించారు. ‘ కొన్నిరోజుల క్రితం అమిత్‌ షా నాపై ఆరోపణలు చేశారు. దేశంలోని అవినీతిపరులందరికీ శరద్ పవార్ ఒక కమాండర్ అని పేర్కొన్నారు. అయితే.. చట్టాన్ని దుర్వినియోగం చేశారంటూ ఓ కేసులో సుప్రీంకోర్టు ఆయన్ని రెండేళ్ల పాటు గుజరాత్ నుంచి బహిష్కరించింది. అలాంటి వ్యక్తి దేశహోంమంత్రిగా ఉండటం విచిత్రంగా ఉంది. దేశం ఎలాంటివారి చేతిలో ఉందో మనమంతా ఆలోచించుకోవాలి. ఇలాంటి వారు దేశాన్ని వందశాతం తప్పుడు మార్గంలో నడిపిస్తారు.’ అంటూ శరద్‌ పవార్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

2011లో సోహ్రాబుద్ధీన్ షేక్ ఎన్ కౌంటర్

2010లో సోహ్రాబుద్ధీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అమిత్‌ షాను సుప్రీంకోర్టు గుజరాత్‌ నుంచి రెండేళ్ల పాటు బహిష్కరించింది. అయితే, ఈ కేసులోనే 2014లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. జులై 21న మహారాష్ట్రలోని పూణేలో జరిగిన బీజేపీ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ఆ సమయంలో శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు. అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలకు శరద్ పవార్ ఘాటుగా స్పందించారు.



Next Story

Most Viewed