Mollywood: మలయాళ చిత్ర దర్శకుడు వీకే ప్రకాష్‌పై లైంగిక వేధింపుల కేసు

by S Gopi |   ( Updated:2024-08-30 14:58:29.0  )
Mollywood: మలయాళ చిత్ర దర్శకుడు వీకే ప్రకాష్‌పై లైంగిక వేధింపుల కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో: మలయాళ చిత్ర వీకే ప్రకాష్‌పై గురువారం లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనపై లైంగికంగా వేధింపులు రావడంతో ముందస్తు బెయిల్‌ కోసం ప్రకాష్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. 2022లో కొల్లాంలోని ఓ హోటల్‌లో ప్రకాష్‌కు కథ చెప్పేందుకు వెళ్లిన సమయంలో తనను లైంగికంగా వేధించాడని ఓ స్క్రిప్ట్ రైటర్ పేర్కొన్నట్లు సమాచారం. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితులకు సంబంధించి ఇటీవల జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన నేపథ్యంలో ఈ ఆరోపణలు వచ్చాయి. అయితే సదరు మహిళ ఆరోపణలను కొట్టిపారేసిన ప్రకాష్, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 'వీకే ప్రకాష్ నిర్దోషి అని, తన పిటిషనర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు లాక్కోవాలనే ఏకైక ఉద్దేశ్యంతో నిర్లక్ష్యపు ఆరోపణలతో ఇరికించినట్టు ' ఆయన న్యాయవాది పేర్కొన్నారు. ఇది ఆగస్టు 19న జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న సినీ ప్రముఖులపై (నటీనటులు, దర్శకులు, ప్రొడక్షన్ కంట్రోలర్‌లతో సహా) నమోదైన 10వ కేసు కావడం గమనార్హం. ప్రకాష్ కంటే ముందు దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, ముఖేష్, జయసూర్య, మణియంపిల్ల రాజు, ఇడవేల బాబు, అడ్వకేట్ చంద్రశేఖరన్, ప్రొడక్షన్ కంట్రోలర్లు నోబుల్, విచ్‌లపై వేర్వేరు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story