బెంగాల్, ఒడిశాలో వేడిగాలులు.. రెడ్ అలెర్ట్ జారీ..!

by Dishanational6 |
బెంగాల్, ఒడిశాలో వేడిగాలులు.. రెడ్ అలెర్ట్ జారీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ పరిస్థితుల వల్ల ఒడిశా, బెంగాల్ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపింది ఐఎండీ. బెంగాల్‌లోని గంగానదిలో చాలా రోజులుగా తీవ్ర వేడిగాలులు వీస్తున్నాయని.. అందుకే రెడ్ అలర్ట్ ప్రకటించామని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త సోమా సేన్ రాయ్ తెలిపారు.

ముఖ్యంగా ఉత్తర ఒడిశాలో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని తెలిపారు అధికారులు. బెంగాల్ లో లాగా వేడిగాలుల తీవ్రత లేకున్నా.. చాలా రోజుల వరకు హీట్ వేవ్ ఉంటుందని రెడ్ అలెర్ట్ ప్రకటించామంది ఐఎండీ.

తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. బిహార్, ఝార్ఖండ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కేరళలోని ఉత్తర ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పురావడంతో.. ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని తెలిపింది ఐఎండీ.

ప్రధానంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో, ఉరుములు, అలాగే భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ మొదలైన ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య భారతదేశంలో మళ్లీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు సైంటిస్టులు. తూర్పు ప్రాంతంలో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపారు.



Next Story

Most Viewed