Delhi Election Results : ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం

by M.Rajitha |
Delhi Election Results : ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) బీజేపీ ఘన విజయం(BJP Won) సాధించిన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి ఏకంగా 48 చోట్ల జయకేతనం ఎగురవేసింది. దీంతో దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విమారం తర్వాత దేశ రాజధాని ఢిల్లీ కాషాయ పార్టీ సొంతమయింది. ఈ ఎన్నికల్లో మూడుసార్లు ఢిల్లీ సీఎంగా పని చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌(Aravind Kerjiwal) సహా పలువురు ఆప్ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(Delhi Leftinent Governor) వినయ్ కుమార్ సక్సేనా(Vinay Kumar Saksena) సచివాలయ ఉద్యోగులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి ఎలాంటి ఫైల్స్‌, హార్డ్‌ డ్రైవ్స్‌ బయటకు వెళ్ల కూడదని ఉత్తర్వులు జారీ చేశారు.

'ఢిల్లీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ నుంచి ఎలాంటి ఫైల్స్‌, డాకుమెంట్స్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్స్‌ బయటకి తీసుకెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ అత్యవసరమైతే జనరల్‌ అడ్మినిష్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో సెక్రటేరియట్‌కు చెందిన అన్ని విభాగాల అధిపతులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం’'అని ఎల్జీ కార్యాలయం(LG Office) ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ)AAP) ప్రభుత్వంపై బీజేపీ గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం కేజ్రీవాల్‌ సహా పలువురు మంత్రులు, ఆప్‌ కీలక నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓటమి పాలైన నేపథ్యంలో కీలక ఫైల్స్‌ మాయమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్జీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed