- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరాముడిపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: రాముడిపై జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేందుకు రాముడి పేరును మాత్రమే బీజేపీ ఉపయోగిస్తుందని, అయితే రాముడు హిందువుల దేవుడు మాత్రమే కాదని ఫరూఖ్ వ్యాఖ్యానించారు. రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని, అందరికీ దేవుడని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు రాముడిపై ప్రేమ లేదు, అధికారంపై వారికి ప్రేమ ఉందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
భగవాన్ రాముడు ప్రతి ఒక్కరికీ దేవుడని, అది ముస్లిం లేదా క్రిస్టియన్ లేదా అమెరికన్ లేదా రష్యన్ కు అయినా, రాముడిపై విశ్వాసం ఉందని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. జమ్మూ, కశ్మీరులో ఎన్నికలు ప్రకటించినపుడు సామాన్యుల దృష్టి మరల్చేందుకు రామ మందిరాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యతకు ఎలాంటి అడ్డంకులు లేవని అబ్దుల్లా చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల గురించి ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, వాటి వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.