ఆర్మీ ఆధ్వర్యంలో యూసీసీపై సెమినారా.. ? ఇద్దరు సీఎంలు భగ్గు

by Hajipasha |
ఆర్మీ ఆధ్వర్యంలో యూసీసీపై సెమినారా.. ? ఇద్దరు సీఎంలు భగ్గు
X

దిశ, నేషనల్ బ్యూరో : యూనిఫాం సివిల్ కోడ్‌ (యూసీసీ) అంశంపై ఈనెల 26న కశ్మీర్ యూనివర్సిటీ వేదికగా విద్యార్థులకు ప్రత్యేక సెమినార్ జరగనుంది. ఈ సదస్సును భారత సైన్యం నిర్వహిస్తుండటంతో అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు యాక్టివ్ అయ్యాయి. కశ్మీర్ వంటి సున్నిత ప్రాంతంలో ఇంకా చట్టబద్ధత లభించని యూసీసీ వంటి వివాదాస్పద అంశంపై స్వయంగా ఆర్మీ సదస్సులు నిర్వహించడం అవసరమా అని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. రాజకీయ, మతపరమైన అంశాలకు అతీతంగా ఆర్మీ ఉండటం మంచిదని సూచించారు. ఇలాంటి వివాదాస్పద సెమినార్లను నిర్వహిస్తే మతపరమైన, రాజకీయపరమైన అంశాల్లో సైన్యం తలదూర్చినట్లు అవుతుందన్నారు. దీనిపై మాజీ సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. ‘‘దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల్లోకి బీజేపీ మతాన్ని చొప్పించింది. ఇప్పుడు ఆర్మీ కూడా బీజేపీ మత రాజకీయాల బాధిత సంస్థగా మారినట్టు అనిపిస్తోంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed