Congress: ఎన్‌హెచ్‌ఆర్‌సీ చీఫ్ ఎంపికలో సరైన విధానం పాటించలేదు- కాంగ్రెస్

by Shamantha N |
Congress: ఎన్‌హెచ్‌ఆర్‌సీ చీఫ్ ఎంపికలో సరైన విధానం పాటించలేదు- కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)(NHRC) చీఫ్ ఎంపిక లోపభూయిష్ఠంగా ఉందని కాంగ్రెస్(Congress) అసమ్మతి తెలియజేసింది. అయితే ఛైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని పాటించలేదని కాంగ్రెస్ (Congress) అభ్యంతరం వ్యక్తంచేస్తూ ప్రకటన విడుదల చేసింది. “ఇలాంటి నియామకాల్లో పరస్పర సంప్రదింపులు, ఏకాభిప్రాయం వంటి సంప్రదాన్ని మరిచారు. ఈ ఎంపిక సెలక్షన్ కమిటీ విశ్వసనీయత, నిష్పాక్షికతను దెబ్బతీస్తుంది. సమావేశంలో లేవనెత్తిన చట్టబద్ధమైన ఆందోళనలను పక్కనపెట్టి, పేర్లను ఖరారు చేయడానికి సంఖ్యాపరమైన మెజార్టీపై ఆధారపడ్డారు. పౌరులు, ముఖ్యంగా సమాజంలోని అట్టడుగువర్గాలకు చెందిన వారి ప్రాథమిక హక్కులు, మానవహక్కులు పరిరక్షించడంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలకమైన చట్టబద్ధమైన సంస్థ. దాని ప్రాతినిధ్యంపైనే సామర్థ్యత, సమగ్రత ఆధారపడి ఉంటుంది. వివిధ కమ్యూనిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లకు, ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎక్కువగా గురవుతున్న వారి పట్ల సున్నితంగా ఉండేందుకు విభిన్న నాయకత్వమే తోడ్పడుతోంది.” కాంగ్రెస్ తెలిపింది.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్ పర్సన్ ఎంపిక

ఇకపోతే, జాతీయ మానవ హక్కుల కమిషన్‌(NHRC) కొత్త చైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు. జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలం జూన్‌1తో ముగియడంతో ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్ పర్సన్ పదవి ఖాళీగా ఉంది. కొత్త ఛైర్ పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్‌ 18న సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి ముర్ము నియమించారు. చైర్మన్‌ రామసుబ్రమణియన్‌తోపాటు సభ్యులుగా ప్రియాంక్‌ కనూంగో, డాక్టర్‌ బిద్యుత్‌ రంజన్‌ సారంగి (రిటైర్డ్‌)లను నియమిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్సీ తెలిపింది. కనూంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) చైర్‌ పర్సన్‌గా పనిచేశారు. గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సీజేఐలలో హెచ్‌ఎల్‌ దత్తు, కేజీ బాలకృష్ణన్‌ ఉన్నారు

Next Story