సెబీ చీఫ్ రాజీనామా చేయాలి : ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్

by M.Rajitha |
సెబీ చీఫ్ రాజీనామా చేయాలి : ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్
X

దిశ, వెబ్ డెస్క్ : హిండెన్‌బర్గ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ ఛైర్మన్ మాధవి బుచ్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు . మోదీ అతని స్నేహితులతో కలిసి దేశాన్ని అవినీతి మయం చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని అదానికి దోచిపెడుతున్నారని, అన్ని రంగాలను బీజేపీ అవినీతి మయం చేసిందని, చివరకు సెబీని కూడా వదల్లేదని దుయ్యబట్టారు. హిండెన్‌బర్గ్ చేస్తోన్న ఆరోపణలకు సెబీ ఛైర్మన్ భాద్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని లేదంటే ఆగస్ట్ 22న అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. స్టాక్ మార్కెట్లలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కాగా అంతకముందు ఏఐసీసీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.

Next Story

Most Viewed