కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

by M.Rajitha |
కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కూడా ఖరారైంది. జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో పోటీకి దిగుతుండగా, కాంగ్రెస్ 32 చోట్ల పోటీ చేయనుంది. మిగిలిన సీట్లలో ఐదింటిలో కాంగ్రెస్-ఎన్సీ విడివిడిగా పోటీ చేయగా, రెండు స్థానాల్లో సీపీఎం, మరోచోట జేకేఎన్పీపీ పోటీ చేయనుంది.

కాగా.. చివరిసారిగా జమ్మూ కాశ్మీర్ లో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం 'ఆర్టికల్ 370'ను రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. సుప్రీం కోర్టు ఎలాగైనా సెప్టెంబరు లోగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో, ఈసీ ఎన్నికల ప్రకటన జారీ చేసింది. కాగా 90 అసెంబ్లీ స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. అక్టోబరు 4న ఫలితాలు వెల్లడించనున్నారు.

Next Story

Most Viewed