లైంగిక వేధింపుల చట్టం విస్తృతమైనది : హైకోర్టు

by Vinod kumar |
లైంగిక వేధింపుల చట్టం విస్తృతమైనది : హైకోర్టు
X

న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టం (ఎస్‌హెచ్‌డబ్ల్యూ-2013 యాక్ట్) పరిధి ఆ మహిళ పని చేసే కార్యాలయానికే పరిమితం కాదని.. ఇతర కార్యాలయాల్లో పని చేసే వ్యక్తి వేధించినా చర్యలు తీసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని తమ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకే పరిమితం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. పని వాతావరణం పురుషులకు ఉన్నట్లే మహిళలకూ సురక్షితగా ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.

ఒక మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో తమ ముందు హాజరు కావాలని ఒక ఐఆర్ఎస్ అధికారికి ఓ కార్యాలయానికి చెందిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) నోటీసు జారీ చేసింది. తాను నోటీసు జారీ చేసిన కార్యాలయానికి చెందిన వాడిని కానని, దీంతో ఆ కార్యాలయానికి చెందిన ఐసీసీకి తనకు నోటీసు జారీ చేసే హక్కు లేదంటూ ఆ ఐఆర్ఎస్ అధికారి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కు వెళ్లారు. ఐఆర్ఎస్ అభ్యర్థనను సమర్ధించిన క్యాట్.. ఐసీసీ జారీ చేసిన నోటీసును రద్దు చేసింది. దీనిపై మహిళ హైకోర్టు వెళ్లగా క్యాట్ తీరును తప్పుబట్టింది. ఆ నోటీసుకు ఐఆర్ఎస్ అధికారి సమాధానం ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed