- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎలక్టోరల్ బాండ్ల’తో రాజకీయ విరాళాలు.. సుప్రీంకు ఎస్‌బీఐ రిక్వెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు సేకరించిన విరాళాల సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడానికి తమకు ఇచ్చిన గడువును జూన్ 30 వరకు పొడిగించాలని సుప్రీంకోర్టును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అభ్యర్థించింది. గతనెలలో ఎలక్టోరల్ బాండ్ల జారీ స్కీంను దేశ సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇప్పటివరకు ఆ స్కీం ద్వారా రాజకీయ పార్టీలు సేకరించిన నిధులు, దాతల చిట్టాను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి అందజేయాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎస్‌బీఐ రిక్వెస్టుపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది వేచిచూడాలి. ఒకవేళ ఎస్‌బీఐకి విధించిన డెడ్‌లైన్ గడువును పొడిగించేందుకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే.. దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలిచ్చిన దాతల వివరాలు బయటికి వస్తాయి. ఇందుకు భిన్నంగా ఆర్డర్ వస్తే.. ఈ ఎన్నికల్లోపే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలిచ్చిన దాతల చిట్టా వెలుగుచూసే ఛాన్స్ ఉంటుంది. అందుకే తదుపరిగా ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.