రాజ్యాంగ ధర్మాసనానికి స్వలింగ సంపర్కుల వివాహ కేసు

by Harish |
రాజ్యాంగ ధర్మాసనానికి స్వలింగ సంపర్కుల వివాహ కేసు
X

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై విచారణ ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్థివాలాతో కూడిన బెంచ్ తెలిపింది. ఈ కేసు విచారణ వచ్చే నెల 18 నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. దీనిపై తీసుకునే ఏ నిర్ణయమైనా సమాజంపై, పెద్దగా ప్రభావం చూపుతుందని తెలిపింది. ఏ ఒక్కరి సమయాన్ని తగ్గించుకోకుండా పరిశీలనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది.

‘ఈ కోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ద్వారా లేవనెత్తిన సమస్యలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3)కి అనుగుణంగా పరిష్కరించాలని మేము భావిస్తున్నాము. దీని కోసం ఐదుగురు జడ్జిలతో కూడిన బెంచ్ ముందు ఉంచుతున్నాం’ అని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. ఆదివారం స్వలింగ సంపర్క వివాహాల చట్టబద్ధతపై కేంద్రం విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

భారత కుటుంబ విధానంలో భర్త, భార్య, పిల్లలు తప్పనిసరని అఫిడవిట్‌లో పేర్కొంది. అంతకుముందు పలు రాష్ట్రాల్లో స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధత కల్పించాలని పలువురు ఆయా హైకోర్టులను ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు వీటన్నింటిని కలిపి విచారణకు స్వీకరించింది.

Advertisement

Next Story