- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman kurshid: భారత్‌లోనూ బంగ్లా తరహా అల్లర్లు జరగొచ్చు.. కాంగ్రెస్ నేత సల్మా్న్ ఖుర్షీద్
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోనూ బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. బంగ్లాదేశ్‌లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ, అక్కడి మాదిరిగానే హింసాత్మక నిరసనలు ఇండియాలోనే జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా ఆయన న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖుర్షీద్ ప్రసంగించారు. కశ్మీర్‌లో ప్రతిధీ సాధారణంగానే కనిస్తుందని, కానీ వాస్తవం ఎక్కడుందో గ్రహించాలన్నారు. ఆగ్నేయ ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో మహిళలు నాయకత్వం వహించి దాదాపు 100 రోజుల పాటు కొనసాగిన సీఏఏ, ఎన్నార్సీ నిరసనలు దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రదర్శనలను ప్రేరేపించాయని గుర్తు చేశారు. ఆ నిరసనల్లో పాల్గొన్న చాలా మంది ఇప్పటికీ జైళ్లలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఎంతమందికి ఈ దేశ శత్రువులుగా ముద్ర పడిందో ఊహించలేమన్నారు. కాగా, బంగ్లాదేశ్ లో సంక్షోభ పరిస్థితుల వేళ ఖుర్షీద్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.