Salman Khan: ఇండియన్ నేవితో బాలీవుడ్ స్టార్ హీరో సందడి..

by Hamsa |   ( Updated:2022-08-11 10:16:05.0  )
Salman Khan Spends a Day with Indian Navy At Visakhapatnam
X

దిశ, వెబ్‌డెస్క్: Salman Khan Spends a Day with Indian Navy At Visakhapatnam| ప్రధాని మోదీ ఈ నెల 2 నుంచి 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతి పౌరుడు తమ సోషల్ మీడియా ఖాతాల్లో డీపి మార్చాలని.. అంతే కాకుండా ప్రతీ ఇంటిపై తిరంగ జెండాను ఎగరవేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారతదేశం నిర్వహించుకుంటున్న 75వ స్వాతంత్ర దినోత్స వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా అన్ని ప్రదేశాల్లో ప్రముఖులు తిరంగ జెండాను ఎగరవేస్తున్నారు.

అదే విధంగా విశాఖపట్నంలోని యుద్ధనౌకలో ఏర్పాటు చేసిన 'ఆజాదీ కా మహోత్సవాల్లో' భాగంగా ఇండియన్ నేవీతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సందడి చేశాడు. నేవి సైనికులతో కలిసి జెండాను ఎగరవేసి వీరితో రోజంతా ఉల్లాసంగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి: నటి సురేఖ వాణిపై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ!

Advertisement

Next Story