- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళా రెజ్లర్ల ఆందోళనలో బిగ్ ట్విస్ట్.. నిరసన నుండి పక్కకు తప్పుకున్న స్టార్ రెజ్లర్!
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ, భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని.. అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భారత మహిళా రెజ్లర్లు గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ ఆందోళనలో భారత స్టార్ మహిళా రెజ్లర్స్ సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత ఫోగట్ తదితరులు పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం మహిళా రెజ్లర్స్ చేపట్టిన ఆందోళనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఈ ఆందోళన నుండి ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్ తప్పుకుంది. తన ఆందోళనను విరమిస్తున్నట్లు సాక్షి మాలిక్ తెలిపింది. తిరిగి తన రైల్వే జాబ్‌లో చేరనున్నట్లు సాక్షి మాలిక్ ప్రకటించింది. కాగా, గత రెండు రోజుల క్రితమే బ్రిజ్ భూషణ్ వ్యవహరంపై చర్చించేందుకు సాక్షి మాలిక్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యింది.
ఈ సమావేశం జరిగిన రెండు రోజులకే రెజ్లర్లు సీరియస్‌గా చేస్తోన్న ఆందోళన నుండి సాక్షి మాలిక్ తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇక, బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని ఈ నెల 9వ తేదీ వరకు కేంద్రానికి డెడ్ లైన్ విధించిన రెజ్లర్లు.. అప్పటిలోగా అతడిని అరెస్ట్ చేయకపోతే తమ పతకాలను గంగా నదిలో పడేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.