S Jaishankar: ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న జైశంకర్

by Shamantha N |
S Jaishankar: ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణాస్వీకారానికి భారత విదేశంగా మంత్రి ఎస్ జైశంకర్(External Affairs Minister S Jaishankar) హాజరుకానున్నారు. జనవరి 20న వాషింగ్టన్ డీసీ (Washington DC)లో అమెరికా 47వ అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమానికి జైశంకర్ హాజకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది."అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. భారత తరఫున జైశంకర్ ప్రాతినిధ్యం వహిస్తారు" అని ప్రకటనలో పేర్కొంది. అమెరికా పర్యటనలో భాగంగా జైశంకర్ ఇతర ప్రముఖులతో కూడా భేటీ కానున్నట్లు వెల్లడించింది.

ప్రమాణస్వీకారానికి ప్రపంచ నాయకులు

అయితే, ట్రంప్ ప్రమాణస్వీకారానికి పలువురు ప్రపంచ నాయకులు హాజరుకానున్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి అంగీకరించినట్లు సమాచారం. హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే, క్యాపిటల్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్వహించే కార్యక్రమంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ట్రంప్ తన ప్రారంభ ప్రసంగం చేస్తారు. పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు జో బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అలానే, అధికార బదిలీని వీక్షిస్తారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్, బిడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. 2017 నుండి జనవరి 2021 ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా పనిచేశారు.

Next Story