రష్యా సైనికుడికి జీవిత ఖైదు.. యుద్ధ నేరం కేసులో కోర్టు తీర్పు

by Harish |
రష్యా సైనికుడికి జీవిత ఖైదు.. యుద్ధ నేరం కేసులో కోర్టు తీర్పు
X

కీవ్: ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడిన రష్యన్ సైనికుడి విషయంలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిరాయుధుడైన ఉక్రెయిన్ పౌరుడిని హతమార్చినందుకు గానూ సోమవారం కోర్టు జీవిత ఖైదు విధించింది. 21 ఏళ్ల రష్యా సైనికుడు వాదిం షిషిమరిన్ కారులో వెళ్తున్న 62 ఏళ్ల వృద్దుడిని ఫిబ్రవరి 28న హతమార్చినట్లు అంగీకరించారు. కొన్ని రోజుల క్రితమే ఆయన తన నేరాలను కోర్టు ముందు అంగీకరించారు. తనను క్షమించి, వదిలేయాలని న్యాయమూర్తిని వేడుకున్నాడు. ట్రయల్ లో బాధితుడిని భార్యను కూడా క్షమించాలని కోరాడు. అయితే, తాజాగా కోర్టు దీనిపై విచారిస్తూ, వాదింకు జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. కాగా, రష్యా యుద్ధ నేరాలకు సంబంధించి ఉక్రెయిన్‌ కోర్టు తొలిసారిగా రష్యా సైనికుడికి శిక్ష విధించింది.



Next Story