కోల్‌కతా కేసులో మరో ట్విస్ట్.. ఆ రోజు రాత్రి స్నానం చేసిందెవరు..?

by karthikeya |
కోల్‌కతా కేసులో మరో ట్విస్ట్.. ఆ రోజు రాత్రి స్నానం చేసిందెవరు..?
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా ఆర్‌జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ కేసు (Kolkata Trainee Doctor Case)లో సంచలన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలిపై అత్యాచారం-హత్య చేసిన వారిలో ఓ జూనియర్ డాక్టర్ కూడా ఉన్నట్లు సీబీఐ దర్యాప్తు (CBI Investigation)లో తేలింది. ఈ మేరకు ఆధారాలు లభించిననట్లు అధికారులు శనివారం నాడు వెల్లడించారు. ట్రైనీ డాక్టర్‌ (Trainee Doctor) మరణించిన రోజున అంటే ఆగస్టు 9న ఓ జూనియర్‌ డాక్టర్‌ ఛాతీ ఔషధాల విభాగంలోని కూల్చివేసిన బాత్‌రూమ్‌లో స్నానం చేసినట్లు స్పష్టమవుతోందని, ఆ రోజు ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ఓ నర్సు(Nurse) తమకు వాగ్మూలం ఇవ్వడం జరిగిందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. రాత్రి వేళ దుస్తులపై రక్తపు మరకలతో ఉన్న ఓ జూనియర్ డాక్టర్‌ (Junior Doctor)ని సదరు నర్సు చూడడం జరిగింది. ఆ జూనియర్ డాక్టర్‌ని అంతకుముందు ఎప్పుడూ ఆసుపత్రిలో చూడలేదని, అతడిని రక్తపు మరకల గురించి ప్రశ్నించగా.. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వార్డులోని బెడ్ నంబర్ 4లో ఉన్న ఓ మహిళా రోగికి పీఆర్‌బీసీ (PRBC) ఇస్తుండగా తన దుస్తులపై రక్తపు మరకలు (Blood Stains) పడ్డాయని, వాటిని శుభ్రం చేసుకోవడానికే స్నానం చేస్తున్నానని చెప్పినట్లు సీబీఐకి నర్సు వాగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే అతడి పేరు అడిగినా సమాధానం చెప్పలేదని నర్సు చెప్పడం జరిగింది.

‘‘రాత్రి 9 గంటల సమయంలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వార్డు (Multi-Drug Resistance Ward)లోకి జూనియర్ డాక్టర్ ప్రవేశించాడు. వార్డులో ఉన్న ఫ్రిడ్జ్ తెరిచి ఏదో వెతకడం మొదలుపెట్టాడు. ఏం కావాలని అడగ్గా.. పీఆర్‌బీసీ కోసం చూస్తున్నానని ఆ జూనియర్‌ డాక్టర్‌ సమాధానం చెప్పాడు. అతడిని అంతకుముందు నేనెప్పుడూ చూడలేదు. పేరు అడిగినా సమాధానం చెప్పలేదు. అతడి దుస్తులపై ఉన్న రక్తపు మరకల గురించి ప్రశ్నించగా.. పీఆర్‌బీసీ ఇస్తుండగా పడ్డాయని చెప్పి సెమినార్ హాల్ బాత్‌రూంలో స్నానం చేశాడు.’’ అని సదరు నర్స్ తెలిపినట్లు సీబీఐ చెబుతోంది. దీంతో ప్రస్తుతం ఆ జూనియర్ డాక్టర్ ఎవరు..? అతడి శరీరంపై ఉన్న రక్తపు మరకలు బాధితురాలివేనా..? లేక మరో మహిళా పేషెంట్‌వా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా.. ట్రైనీ డాక్టర్ మృతదేహం సెమినార్ హాల్‌లోనే లభ్యం కావడం.. ఆ పక్కనే ఉన్న బాత్‌రూంలో జూనియర్ డాక్టర్ స్నానం చేయడం ఇప్పుడు అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. దానికి తోడు ఆసుపత్రిలో సాక్ష్యాలను తారుమారు చేశారని, క్రైమ్ స్పాట్ పూర్తిగా మారిపోయింది. మృతదేహం ఉన్న సెమినార్ హాల్ సమీపంలోని బాత్‌రూమ్‌ను కూల్చివేశారని సీబీఐ ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌‌ (Sandeep Ghosh)ను, అలాగే ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ (Sanjay Roy)‌ను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed