అంధకారంలో రాజీవ్ గాంధీ బస్టాండ్..

by Aamani |
అంధకారంలో రాజీవ్ గాంధీ బస్టాండ్..
X

దిశ,చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు గత నెల పదిహేను రోజుల నుంచి వెలగకుండా బస్టాండ్ అంధకారంలోనే ఉంది. నిరంతరం వేములవాడ నుండి కోరుట్ల వెళ్లే ఈ ప్రధాన రహదారి చీకటిలోనే ఉంది. బస్టాండ్ సమీపంలో చుట్టూ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ బస్టాండ్ చుట్టుగానే ఉన్నాయి. ఈ బస్టాండ్ నుండే రామన్నపేట తిమ్మాపూర్ గ్రామాలకు వెళ్లే దారి ఉంది. ఈ వీధి దీపాలు వెలగక పోవడంతో దారి తప్పి వెళ్తున్నారు.ముఖ్యంగా ఈ బస్టాండ్ ఆవరణలోనే వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో చీకటిలో ఎవరి పైన దాడి చేస్తాయోమోనని అటువైపుగా వెళ్లడానికి స్థానికులు జంకుతున్నారు. అధికారులు స్పందించి స్ట్రీట్ లైట్లు తొందరగా బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed