- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మోడీకి అందుకే బర్త్ విషెస్ చెప్పలేదు.. రష్యా ప్రెసిడెంట్ క్లారిటీ
దిశ, డైనమిక్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు వేడుకలను దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా మోడీకి వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే శుక్రవారం జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆలోచనలో పడేసింది. దూరంగా ఉండే మిత్రులను నేరుగా కలిసిన సందర్భంలో అడ్వాన్స్‌గా చాలామంది శుభాకాంక్షలు చెబుతుంటారు. కానీ మోడీకి మంచి మిత్రుడిగా ఉన్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రత్యక్షంగా ఎదురుపడినప్పటికీ మోడీకి అడ్వాన్స్‌గా బర్త్ డే శుభాకాంక్షలు చెప్పలేదు. నరేందర్ మోడీ బర్త్ డేకు ముందు ఒకరోజు శుక్రవారం ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు చెందిన అగ్రనేతలు ఇలా ప్రత్యక్షంగా భేటీ కావడం మరికొన్ని గంటల్లో బర్త్ డే వేడుకలు జరుపుకోబోతున్న మోడీకి పుతిన్ శుభాకాంక్షలు చెబుతారని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు.
ఈ విషయంలో స్పందించిన పుతిన్.. ఇలా ముందుగా శుభాకాంక్షలు చెప్పకపోవడానికి రీజన్ ఏంటో వివరించారు. 'తన ప్రియమైన స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేను. అయితే, నేను భారత దేశానికి శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నాను. రేపు నా ప్రియమైన మిత్రుడి పుట్టిన రోజును మీరంతా జరుపుకోబోతున్నారు. ఈ విషయం నాకు తెలుసు. కానీ రష్యన్ సంప్రదాయం ప్రకారం మేమెప్పుడూ ముందుగా అభినందనలు చెప్పం. అందువల్లే నేను మోడీకి అడ్వాన్స్ బర్త్ డే విష్ చేయలేను అని అసలు విషయం చెప్పేశాడు. స్నేహపూర్వక భారత దేశానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరియు మీ నాయకత్వంలో భారతదేశం శ్రేయస్సును కోరుకుంటున్నామని' అన్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ వివాదం చెలరేగిన తర్వాత మోడీ, పుతిన్ సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య సమావేశం సామరస్యపూర్వకంగా జరిగిందని మోడీ ట్వీట్ చేశారు. అధ్యక్షుడు పుతిన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. వాణిజ్యం, ఇంధనం, రక్షణ మరియు మరిన్ని రంగాల్లో భారతదేశం - రష్యా సహకారాన్ని మరింతగా కొనసాగించడం గురించి చర్చించడానికి మాకు అవకాశం లభించింది. మేము ఇతర ద్వైపాక్షిక మరియు ప్రపంచ సమస్యలపై కూడా చర్చించామన్నారు. పనిలో పనిగా ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో పుతిన్‌కు మోడీ సలహా ఇచ్చేశారు. ఈ యుగం యుద్ధాలకు చెందినది కాదని అభివృద్ధి, శాంతి మార్గంలో ఎలా పురోగమించవచ్చనేదాని గురించి పుతిన్‌తో మోడీ మాట్లాడారు.