Viral News: వీడేరా అసలైన మొగుడు.. భార్యకు నచ్చలేదని కారును చెత్తకుండీలో ఎలా పడేశాడో చూడండి!

by Vennela |
Viral News: వీడేరా అసలైన మొగుడు.. భార్యకు నచ్చలేదని కారును చెత్తకుండీలో ఎలా పడేశాడో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్ : Viral News: భార్య భర్త చిన్న చిన్న గొడవలు సర్వసాధారణమే. వాటిని పరిష్కరించుకునేందుకు భర్త చాలానే ప్రయత్నాలు చేశాడు. కానీ అటు నుంచి ఎలాంటి ఫలితం కనిపించలేదు. భార్య అలకను తీర్చాలంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ వేశాడు. వెంటనే 27లక్షలు పెట్టి ఓ లగ్జరీ కారు కొన్నాడు. దాన్ని తీసుకుని తన భార్యకు ఇచ్చాడు. ముసిముసి నవ్వులతో కారును చూసింది. కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. కారుకు చిన్న డ్యామేజ్ కనిపించింది. అంతే నాకు ఈ కారు వద్దంటే వద్దని మూతి ముడిచింది. కోపాన్ని తట్టుకోలేకపోయిన సదరు భర్త కారును తీసుకెళ్లి ఓ చెత్తకుప్పలో పడేశాడు.

భార్య అలిగిందంటే..భర్తకు మూడినట్లే అంటుంటారు. భార్య అలకను తీర్చడం సాధారణమైంది కాదు. ఎన్నో ప్రయత్నాలు చేయాలి. వారికి నచ్చిన వంట చేయడం, డబ్బులు ఖర్చు చేయడం, ఖరీదైన బహుమతులు ఇవ్వడం, నగలు, చీరలు ఇలా ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయి. కానీ వాళ్లు ఇవన్నీ చేసిన తర్వాత భార్యకు నచ్చలేకుంటా మళ్లీ విసుక్కోవడం, చిరాకు పడటం చేస్తుంటారు. కొన్నిసార్లు అవి నచ్చలేదని వాటిని రిటర్న్ ఇవ్వమని వేధిస్తుంటారు. ఇదొక రకమైన టార్చర్ అని చెప్పవచ్చు. భర్తలు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. నరకయాతన పడుతుంటారు. అచ్చం అలాంటి పరిస్థితే వచ్చిందో ఓ వ్యక్తికి. కానీ అతను మాత్రం ఆమె చెప్పినట్లు చేయకుండా..ఆమె కోసం కొన్ని లగ్జరీ కారును చెత్తకుప్పలో పడేశాడు. ఈ వార్త నెట్టింట్ల తెగ వెైరల్ అవుతోంది.

రష్యా రాజధాని మాస్కో నగరానికి చెందిన ఓ జంట మధ్య గొడవలు వచ్చాయి. ఎంత సర్ధుకుపోదామనుకున్నా భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరడం లేదు. అయితే దీనికి ఎలాగైనా చెక్ పెట్టి భార్యతో ప్రేమగా ఉండాలని సదరు భర్త పెద్ద ప్లాన్ వేశాడు. తన భార్యకు నచ్చే ఏదైనా బహుమతి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఆమెకు లగ్జరీ కార్లు అంటే ఇష్టం. దీంతో సదరు భర్త ఆమె కోసం లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. 27లక్షలు పెట్టి ఎస్ యూవీ కారును కొనుగోలు చేశాడు. ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డే రోజు ఇవ్వాలనుకున్నాడు. అయితే ఈ కారును టెస్ట్ డ్రైవ్ కు తీసుకెళ్లగా చిన్న ప్రమాదం జరిగింది.

కారుకు చిన్న డ్యామేజీ జరిగింది. అది పెద్దగా కనిపించపోవడంతో బాగు చేయించకుండానే భార్యకు గిఫ్టుగా అందజేసేందుకు తీసుకెళ్లాడు. కారును బయట పెట్టి భార్యను పిలిచాడు. సర్ ప్రైజ్ అంటూ కారును చూపించాడు. దీంతో తెగ సంబురపడిన భార్య వెంటనే కారు చూసి థాంక్స్ చెబుతూ కారంతా చెక్ చేసింది. ఈ క్రమంలో చిన్న డ్యామేజీ కనిపించింది. డ్యామేజీ అయిన కారు నాకు వద్దంటూ వెళ్లిపోయింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైన సదరు భర్త కారును తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేశాడు. చెత్త కుప్పలో కొత్త కారును చూసి స్థానికులు షాక్ అయ్యారు. అసలేం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. రెండు వారాల పాటు ఆ కారు ఆ చెత్త కుప్పలోనే ఉంది. చెత్త కుప్పలో ఉన్న కారు ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం తెలుసుకున్న స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. చిన్న డ్యామేజ్ ఉంటే కారును చెత్త కుప్పలో పడేస్తుందా అని కొందరు అంటుంటే..ఎంత ప్రేమ ఉంటే లగ్జరీ కారు బహుమతిగా ఇస్తాడు అంటూ సదరు భర్తను వెనకేసుకొస్తున్నారు కొందరు. భార్య కోపం కారుకు శాపమైంది.


Next Story

Most Viewed