- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు పుత్రులను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు: కుమారస్వామి హామీ
బెంగళూరు: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కీలక హామీ ఇచ్చారు. రైతు పుత్రులను పెళ్లి చేసుకున్న యువతులకు రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. తాజాగా కొలార్‌లో నిర్వహించిన పంచతంత్ర ర్యాలీలలో ఆయన మాట్లాడారు. రైతుల పిల్లల పెళ్లిళ్లకు ప్రొత్సాహాం అందిస్తామని చెప్పారు. ‘రైతుల కొడుకుల పెళ్లిళ్లకు ఆడపిల్లలు సిద్ధంగా లేరని నా దృష్టికి వచ్చింది. రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు రూ. రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేలా ప్రభుత్వం కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని నాకు వినతిపత్రం అందింది’ అని కుమారస్వామి అన్నారు. వచ్చే నెల 10న కర్ణాటకలో పోలింగ్ జరగనుంది. మొత్తం 224 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 123 స్థానాలు గెలవాలని జేడీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో 93 సభ్యులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.