RRB Exams: జూనియర్ ఇంజినీర్ సహా పలు రైల్వే ఉద్యోగాలకు పరీక్ష తేదీలను ప్రకటించిన RRB

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-08 12:51:00.0  )
RRB Exams: జూనియర్ ఇంజినీర్ సహా పలు రైల్వే ఉద్యోగాలకు పరీక్ష తేదీలను ప్రకటించిన RRB
X

దిశ, వెబ్‌డెస్క్:ఇండియన్ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(RRB) జూనియర్ ఇంజినీర్(JE) ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. జూనియర్ ఇంజినీర్ సీబీటీ1(CBT1) పరీక్ష తేదీలను తాజాగా ప్రకటించింది. ఈ ఎగ్జామ్స్ డిసెంబర్ 6 నుంచి 13 వరకు కంప్యూటర్ బేస్డ్(CBT) విధానంలో జరుగుతాయని ప్రకటించింది. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పరీక్షలు నవంబర్ 25 నుంచి 29 వరకు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) పరీక్షలు డిసెంబర్ 2 నుంచి 5 వరకు, టెక్నీషియన్ పోస్టులకు డిసెంబర్ 16 నుంచి 26 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు షెడ్యూల్ రిలీజ్ చేశారు. కాగా 7,951 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఆగస్ట్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జులై 30వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 29వ తేదీ వరకు కొనసాగింది.ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఉన్నాయి. కాగా RRB జూనియర్ ఇంజినీర్ పరీక్షలను సీబీటీ1, సీబీటీ2గా రెండు దశలలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.rrbapply.gov.in వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed