- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AAP MLA: రోడ్లను హేమమాలని బుగ్గాల్లా చేస్తా.. ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: డ్రీమ్ గర్ల్, ఎంపీ హేమ మాలినీ (Hema Malini)పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఎమ్మెల్యే (AAP MLA) నరేష్ బల్యాన్ ఉత్తమ్ నగర్ (Uttam Nagar)రోడ్లపై మాట్లాడారు. ఉత్తమ్ నగర్ రోడ్లనును హేమ మాలినీ చీక్స్ లా నున్నగా (Road like Hema Malinis cheeks) చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ‘ఉత్తమ్ నగర్ రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా సన్నగా చేస్తాను’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
బీజేపీ నేతల ఆగ్రహం
ఆప్ ఎమ్మెల్యే నరేష్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచేలా, అవమానించేలా ఉన్నాయన్నారు. హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.