ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి.. వీవీపాట్స్‌పై కాంగ్రెస్ ఆగ్రహం

by Vinod kumar |
ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి.. వీవీపాట్స్‌పై కాంగ్రెస్ ఆగ్రహం
X

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ (ఈసీ) డిఫెక్టివ్ వీవీపాట్స్ యంత్రాలను గుర్తించడాన్ని కాంగ్రెస్ శుక్రవారం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ప్రతి ఒక్కరి సహాయాన్ని తీసుకోవాలని పోల్ బాడీని కోరింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ ఈసీపై అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు వీవీపాట్స్ విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని కోరింది. 6.5 లక్షల వీవీపాట్ మెషిన్లు లోపభూయిష్టంగా ఉన్నట్టు ఈసీ పేర్కొందని.. వాటి మరమ్మతు కోసం తయారీదారులకు పంపినట్టు మీడియా నివేదికలు వెల్లడించాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు.

ఈ వీవీపాట్స్ లేటెస్ట్ ఎం3 టైపు. వీటిని ఈసీ 2018లో తీసుకొచ్చింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 17.4 లక్షల వీవీపాట్ మెషిన్లను ఉపయోగించినట్టు కాంగ్రెస్ నేత తెలిపారు. 3.43 లక్షల వీవీపాట్స్ మాత్రమే మెయింటెనెన్స్ బాగాలేదని.. మీడియా నివేదికల ప్రకారం 6.5 లక్షలు కాదని ఈసీ సమాధనమిచ్చింది. ఈ వీవీపాట్స్‌లో డిఫెక్ట్ ఉన్నప్పటికీ అవి తప్పుడు ఫలితాలను ఇవ్వవని.. ఎన్నికల సమయంలో ఆగిపోయే అవకాశం మాత్రం ఉందని అధికారులు అంటున్నారు.

Advertisement

Next Story