'ఈ ఘటన 2020 నాటిది'.. మూత్ర విసర్జన ఘటన మరో మలుపు

by Vinod kumar |
ఈ ఘటన 2020 నాటిది.. మూత్ర విసర్జన ఘటన మరో మలుపు
X

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన కూలీ దశమత్‌ రావత్‌ పై ప్రవేశ్‌ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వివాదం మరో మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాళ్లు కడిగిన వ్యక్తి.. మూత్ర విసర్జన ఘటనకు సంబంధించిన వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి ఒకరు కాదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దశమత్‌ రావత్‌ కీలక వివరాలు వెల్లడించాడు. "ఈ సంఘటన 2020లో జరిగింది. నేను అప్పుడు మద్యం మత్తులో ఉండటంతో ఏమీ అర్థం చేసుకోలేకపోయాను. నాపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఎవరో కూడా నేను చూడలేదు" అని అతడు చెప్పాడు. అయితే నిందితుడు ప్రవేశ్ శుక్లా స్వయంగా నేరాన్ని అంగీకరించడంతో.. ఆమూత్ర విసర్జన ఘటన మరో మలుపు.. ఈ ఘటన 2020 నాటిది.. సంఘటన నిజంగానే జరిగిందని తాను కూడా నమ్మానని దశమత్‌ రావత్‌ మీడియాకు తెలిపాడు.

"2020 సంవత్సరం నాటి వీడియో వైరల్‌ కావడంతో నన్ను ఇటీవల పోలీసు స్టేషన్‌కు, ఆపై కలెక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. అయితే వీడియోలో వేధింపులకు గురైన వ్యక్తిని నేను కాదు అని కలెక్టర్‌ తో పదేపదే అబద్ధం చెప్పాను" అని దశమత్‌ రావత్‌ వివరించాడు. ప్రవేశ్ శుక్లా తప్పు తెలుసుకున్నాడని, ఎప్పుడో జరిగిన ఘటనకు ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రవేశ్‌ శుక్లాను విడుదల చేయాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరాడు. ఈ నేపథ్యంలో మూత్ర విసర్జన ఘటనకు సంబంధించిన అసలు బాధితుడు దశమత్‌ రావత్‌ కాదని, మరో వ్యక్తి అన్న అనుమానాలు బలపడుతున్నాయని కథనాలు వస్తున్నాయి.

Advertisement

Next Story