9,000 వేల ఉద్యోగులను తొలగించేందుకు జియోమార్ట్ ప్లాన్

by Mahesh |   ( Updated:2023-05-23 06:52:34.0  )
9,000 వేల ఉద్యోగులను తొలగించేందుకు జియోమార్ట్ ప్లాన్
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోమార్ట్.. 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే మరో 9,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులు ముఖ్యంగా.. జియోమార్ట్ హోల్ సేల్ విభాగంలో అధికంగా ఉన్న శ్రామిక శక్తిని తగ్గించే ఉద్దేశంతో ఉద్యోగాల కోతకు పూనుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల, రిలయన్స్ మెట్రో క్యాష్ అండ్ క్యారీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో దానిలో పనిచేసే మొత్తం 3,500 మంది ఉద్యోగులతో తన శాశ్వత వర్క్‌ఫోర్స్‌ను జియోమార్టుకు జోడించింది.

Advertisement

Next Story