చాలా సమయం ఉన్నా బ్యాంకులకు పరుగెత్తడానికి కారణం లేదు: RBI గవర్నర్

by Mahesh |   ( Updated:2023-05-22 07:24:44.0  )
చాలా సమయం ఉన్నా బ్యాంకులకు పరుగెత్తడానికి కారణం లేదు: RBI గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: 2,000 నోటు మార్చుకోవడానికి ప్రజలు, లేదా వ్యాపవెత్తలు.. బ్యాంకులకు బారులు తీరుతుండటంపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2,000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశించిన నేపథ్యంలో వాటిని మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి "బ్యాంకులకు వెళ్లడానికి ఎటువంటి కారణం లేదు" అని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం అన్నారు. నోట్ల మార్పిడికి నాలుగు నెలల సమయం ఉందని.. ఆ సమయం వారికి సరిపోతుందని.. దాస్ చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు ఇలా ఒక్కసారిగా బ్యాంకులకు ఎగబడటానికి కూడా కారణం ఉందని.. 2000 నోటు పూర్తిగా రద్దైందని.. దానిని వెంటనే మార్చుకోకుంటే అవి చెల్లవని కొందరు వ్యక్తులు ప్రజలను ఆందోళనకు గురి చేయడం వలన ఇలా జనాలు వాటిని మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి బ్యాంకుల వద్ద గుమిగూడుతున్నారని అంటున్నారు.

Read More: రూ.వెయ్యి నోటు ముద్రణ.. ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ!

Advertisement

Next Story