ఎన్నికల సమయంలో లావాదేవీలను ట్రాక్ చేయాలని ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

by S Gopi |   ( Updated:2024-04-22 10:48:44.0  )
ఎన్నికల సమయంలో లావాదేవీలను ట్రాక్ చేయాలని ఆర్‌బీఐ కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. అధిక విలువైన లేదా అనుమానాస్పద లావాదేవీ వివరాలను తెలియజేయాలని బ్యాంకింగేతర చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లందరికీ (పీఎస్ఓ)ను సూచించింది. 'ఓటర్లను ప్రభావితం చేయడానికి, ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులకు నిధులు అందించేందుకు వివిధ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలు ఉపయోగించే అవకాశం ఉందని' ఆర్‌బీఐ బ్యాంకుయేతర పీఎస్‌ఓలకు పంపిన లేఖలో పేర్కొంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐని కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఈసీ మార్గదర్శకాలను అనుసరించి ఎక్కువ మొత్తం, సందేహాస్పదంగా ఉండే లావాదేవీల గురించి సంబంధిత అధికారి, ఏజెన్సీలకు అందించాలని ఫిన్‌టెక్ కంపెనీలకు సూచించింది. పీఎస్ఓల పరిధిలో పేమెంట్ గేట్‌వేలు, చెల్లింపుల యాప్‌లు, ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా కొనేవరు, అగ్రిగేటర్లు, కార్డు నెట్‌వర్క్‌లు వస్తాయి. వీటిలో మాస్టర్ కార్డ్, వీసా, రూపే, ఫోన్‌పే, గూగుల్ పే, భారత్‌పే వంటి చెల్లింపుల యాప్‌లు ఉన్నాయి. ఎన్నికల సీజన్ పూర్తయ్యేవరకు అనుమానాస్పద లావాదేవీల గురించి ప్రతిరోజూ నివేదికలు ఇవ్వాలని బ్యాంకులకు ఈసీఐ ఆదేశించింది.

Read More..

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దుమారం! ఈసీ చర్యలు తీసుకోవాలని కపిల్ సిబల్ డిమాండ్

Advertisement

Next Story

Most Viewed