- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Rashid Engineer : ఎంపీ రషీద్ ఇంజినీర్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. కోర్టులో ఎన్‌ఐఏ వాదనలు
Rashid Engineer : ఎంపీ రషీద్ ఇంజినీర్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. కోర్టులో ఎన్‌ఐఏ వాదనలు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ రషీద్ ఇంజినీర్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రస్తుతం రషీద్ ఇంజినీర్ ఎంపీగా ఉన్నందున, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని కోర్టుకు తెలిపారు. 26/11 ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ భావజాలాన్ని సమర్ధించిన చరిత్ర ఎంపీ రషీద్ ఇంజినీర్‌కు ఉందని ఎన్ఐఏ వాదన వినిపించింది.
Advertisement
Next Story